మన్యం న్యూస్ మంగపేట ఫిబ్రవరి 12.. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం జరప తలపెట్టిన హైదరాబాద్ టు విజయవాడ జాతి రధర దిగ్భంధనానికి విజయంతో చేయాలని ఎంఆర్పిఎస్ మండల ఇన్చార్జి గుగ్గిళ్ళ సురేష్ ఆదివారం పిలుపునిచ్చారు .మంగపేట మండలం లో ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 13 న తలపెట్టిన
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేయడం కార్యక్రమం లో యువత వేలాది సంఖ్యలో తరలి వచ్చి తలపెట్టిన రహదారి దిగ్బంధం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఓడ బలిజ సంఘం మంగపేట మండల అధ్యక్షులు ఎర్రవుల రమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు చిట్యాల రాజశేఖర్,మాదిగ చిట్యాల బాలకృష్ణ,మాదిగ ఎం ఎస్ పి ఎమ్మార్పీఎస్ గ్రామ నాయకులు చిప్పనపెళ్లి బాబు, మాదిగ , ఎల్ ఆదినారాయణ, మాదిగ అనిల్,మాదిగ , అవయ్య,మాదిగ ఎల్లం దాసరి,శ్రీను మాదిగ కిసరి సారయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
