మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12… మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశం త్వరితగతిన అభివృద్ధి పథంలో నడుస్తుందని పురుషాదిక్య సమాజంలో మహిళలు కూడా వంట ఇల్లు నుంచి అంతరిక్షం వైపుకు పయనిస్తున్నారని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గడల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జి ఎస్ ఆర్ ట్రస్ట్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం సాధికారత కోసం చట్టసభలో కొట్లాడి తెచ్చుకున్న రిజర్వేషన్లను నేడు విద్య వైద్య రాజకీయ రంగాల్లో అందరితో సమానంగా సమాజంలో నిలదొక్కుకొని పురుషులకు దీటుగా పయనిస్తున్నారని అన్నారు. నిర్వహించిన ముగ్గుల పోటీల్లో కూలీ లైన్ ప్రాంతానికి చెందిన శ్రీ వర్ష వేసిన అందమైన ముగ్గుకు ప్రథమ బహుమతి లభించింది రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల చేతుల మీదుగా ఆమె బహుమతులు అందుకుంది.
