UPDATES  

 -2024 వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే….

 

-2024 వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే….
-రైతులు సంక్షేమమే కాంగ్రెస్ అజెండా.
-కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్టు రాజకీయాలకు త్వరలోనే చెక్ పెడతాం.
-నలుగురు ప్రబుద్దుల ఫైల్ ను తక్షణమే సిబిఐ కి అందచేయాలి.
-టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి12: 2024 సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు సంక్షేమ మే కాంగ్రెస్ అజెండా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అన్యాయం చేస్తున్న ధరణిని వెబ్ సైట్ ను తీసివేస్తామన్నారు. నియోజకవర్గ బాధ్యులు ఐదు ఆరుగురు ఉన్నారని, ఎవరు అసలైన బాద్యులో త్వరలో అధికారిక ప్రకటన చేస్తామన్నారు.
ఏజెన్సీ ఏరియా లో నాన్ షెడ్యూల్ వారు కూడ అధిక సంఖ్యలో ఉన్నారని, వారి సమస్య లపై కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యచరణ ఏర్పాటు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్టు రాజకీయాలకు త్వరలోనే చెక్ పెడతామన్నారు.
ఈ జిల్లాలో పోడు భూములు సమస్య తీవ్రంగా ఉందని, పోడు సమస్య లు కాంగ్రెస్ మాత్రమే పరిష్కరించగలదన్నారు. గతంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించి కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్నారన్నారు.
అందరి ని బానిసలుగా మార్చి బానిసల మీద అధికారం చెలయించాలని చూసే వ్యక్తిత్వం ముఖ్య మంత్రి చంద్ర శేఖర్ రావుదన్నారు.
ఢిల్లీ పెద్దల అనుమతి తోనే కార్యక్రమం జరుగుతుందని, ఆయా సందర్భాలలో ఒక్కొక్కరు కలుస్తారని ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.
పినపాక లో దాతలు రూపాయి రూపాయి చందాలు వేసుకొని పార్టీ బిల్డింగ్ కడితే దానిని స్థానిక శాసన సభ్యులు రేగా కాంతారావు కబ్జా చేశారని దాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ కి అప్పగించాలన్నారు. ఆలా చేయని పక్షం లో కాంతారావు ను కే సి ఆర్ కూడా కాపాడ లేరని హెచ్చరించారు. రానున్న ది కాంగ్రెస్ ప్రభుత్వమని పార్టీ ఫిరాయించిన వారందరు తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. 12మంది పార్టీ పిరాయింపుదారులందారి పై న్యాయస్థానం లో సవాల్ చేస్తామన్నారు. వారి పై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. నలుగురు ప్రబుద్దుల ఫైల్ ను తక్షణమే సిబిఐ కి అందచేయాలన్నారు. తెలంగాణ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాయడం ఖాయమన్నారు. తెలంగాణను దోపిడీ చేస్తున్న కుటుంబం ఇంటికి పోవడం తప్పదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !