మన్యం న్యూస్,పినపాక, ఫిబ్రవరి 12
మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, పాత్రికేయులకు, పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గోపాలరావుపేట గ్రామంలో క్రీడా పోటీలను పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, సిఐ రాజగోపాల్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పినపాక ఎంపీటీసీ సత్యం, సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు, మెడికల్ ఆఫీసర్ దుర్గా భవాని, వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.
