మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 13: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కొలువైన ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవ ఆహ్వాన గోడ పత్రికను ఆలయ పునర్ నిర్మాణ ధర్మకర్త,హరి హర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మారగాని శ్రీనివాసరావు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి,అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి,ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు లను మర్యాదపూర్వకంగా కలిసి వారి చేతుల మీదుగా బ్రహ్మోత్సవ ఆహ్వాన గోడ పత్రికలను ఆవిష్కరించారు .