మన్యం న్యూస్ బూర్గంపహడ్ ఫిబ్రవరి 13 మండల పరిధిలోనీ మోతె గ్రామంలో గల శ్రీ మోతె గడ్డ వీరన్న స్వామి ఆలయం ఎన్నో ఏళ్ల ప్రసిద్ధి చెందిన ఆలయంలో వీరన్న భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేరుపొందాడు. ఈ క్రమంలో శివరాత్రి సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా దేవుని కళ్యాణ ఉత్సవ కార్యక్రమంకు ముందుగానే ఏర్పాట్లను పరిశీలించిన పాల్వంచ సీఐ నాగరాజు, బూర్గంపహడ్ ఎస్.ఐ లు సంతోష్, రమణా రెడ్డి అదేవిధంగా పి.ఎ.సి.ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.