మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1966-69 మధ్యకాలంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు శ్రీ ముత్యాలమ్మ వారి 22వ జాతర మహోత్సవముల సందర్భంగా అమ్మవారి నూతన కళ్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఆనందంగా, సంతోషంగా గడిపారు. అనంతరం అమ్మవారి ఆలయాన్ని సందర్శించి శ్రీ ముత్యాలమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కిలిమి ఈశ్వర్ రెడ్డి, ఎస్ వి సత్యనారాయణ రెడ్డి, ఎంవివి రమణారెడ్డి, అప్పారావు, ఆంజనేయ వర్మ, నాగేశ్వరరావు, బైరెడ్డిL సూర్యనారాయణ, భూషణరావు, ఎన్టికే కుమార్, జ్యోతి, హేమలత, నానాజీ తదితరులు పాల్గొన్నారు.