మన్యం న్యూస్, సారపాక, ఫిబ్రవరి 13
బూర్గంపాడు మండల పరిధిలోని మోతే గ్రామానికి సమీపంలో గోదావరి నది మధ్యభాగంలో వెలసి ఉన్న మోత గడ్డ వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించనున్న వీరభద్ర స్వామి కళ్యాణ ఉత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపద్యంలో సోమవారం మోతగడ్డ శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని పాల్వంచ సీఐ నాగరాజు, బూర్గంపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సంతోష్ కుమార్ లు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు తో కలిసి సందర్శించారు. ఉత్సవాల నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. ఆలయానికి వెళ్లే భక్తులు పడవల ద్వారా మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉండడంతో ప్రయాణికుల భద్రత కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో శివరాత్రి సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా దేవుని కళ్యాణ ఉత్సవ కార్యక్రమంకు ముందుగానే ఏర్పాట్లను పరిశీలించిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.