గత కొన్ని సంవత్సరాలుగా సింగర్ స్మిత (Smita)పేరు సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా వినిపించట్లేదు అని చెప్పవచ్చు. కానీ బుల్లితెరపై మాత్రం వివిధ టాలెంట్ షోస్ లో జడ్జిగా పాల్గొంటూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోని తన భర్త గురించి పెళ్లి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. నిజానికి సింగర్ స్మిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నటిగా సోషల్ యాక్టివిటీ గా, సింగర్ గా, బిజినెస్ వుమన్ గా, ఎప్పుడు దేని సమయం దానికే కేటాయిస్తూ ఎంతో ఆదర్శంగా లీడ్ చేస్తోంది.. విజయవాడలో పుట్టి పెరిగిన స్మిత (Smita) మొదటగా హైరబ్బా, మసక మసక చీకటిలో లాంటి పాప్ పాటలతో సింగర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్లే బాక్స్ సింగర్ అయ్యాక అనుకోకుండా ఒక రోజు, ఆట, చత్రపతి ఇలా మరెన్నో సినిమాలలో పాపులర్ సాంగ్స్ పాడింది.. సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె నటిగా మల్లీశ్వరి, ఆట వంటి సినిమాలలో కూడా మెరిసింది.
ప్రస్తుతం ఈమె నిజం విత్ స్మిత అనే టాక్ షో తో అందరిని సర్ప్రైజ్ చేసింది. పైగా ఈ టాక్ షో నుండి చిరంజీవి , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ప్రోమో రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ టాక్ షో సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా స్మిత తాజాగా సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంది.. తన భర్త గురించి మాట్లాడుతూ..’ నా విషయంలో నా భర్త సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. నా వాయిస్ కి మా ఆయన పెద్ద ఫ్యాన్.. ఆయన పేరు శశాంక్.. మాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్.. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ లో ఆయన కూడా ఒకరు.. మా ఫ్రెండ్స్ అంతా ఆయనను బావ అంటారు.. నేను కూడా అలాగే పిలిచేదాన్ని.. అయితే మా మ్యారేజ్ అప్పటికి నా వయసు 21 ఏళ్లు .. మేటర్ అక్కినేని వెంకట్ (నాగార్జున అన్నయ్యగారు) దగ్గరుండి సెట్ చేశారు. మా రెండు ఫ్యామిలీస్ తో ఆయనే మాట్లాడి ఒప్పించారు.. ఇప్పుడు మాకు ఒక పాప కూడా పుట్టింది..’ అంటూ స్మిత చెప్పుకొచ్చారు.