డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) కొద్ది నెలల క్రితం భార్య ప్రణతి రెడ్డితో విడిపోయిన సంగతి తెలిసిందే. 2015లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కానీ, ఎక్కువ కాలం ఈ జంట కలిసి ఉండలేకపోయింది. పెళ్లి అయిన నాలుగు ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. అయితే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికను మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. పలు మార్లు వీరిద్దరూ జంటగా మీడియా కంటపడటం, కలిసి పూజలు చేయడం నెట్టింట జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూర్చాయి. అలాగే ఇంతవరకు మనోజ్(Manoj) ఈ వార్తలకు ఖండించలేదు. పైగా త్వరలోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పి అందరిలోనూ మరిన్ని అనుమానాలు పెంచాడు. దీంతో మనోజ్, మౌనిక పెళ్లి ఖాయమని చాలా మంది నమ్ముతున్నారు. మరికొందరు పెళ్లి కాకుండానే వీరిద్దరూ కాపురం పెట్టారంటూ చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా మనోజ్ రెండో పెళ్లిపై స్పందించిన మంచు లక్ష్మీ(Manchu Lakshmi) షాకింగ్ కామెంట్ చేసింది. తాజాగా మంచు లక్ష్మీ శ్రీకాళహస్తిలోని శివుని ఆలయాన్ని సందర్శించారు. దర్శనం అనంతరం అక్కడ లోకల్ మీడియాతో ఆమె మాట్లాడారు. తాను పరమేశ్వరుడి భక్తురాలినని, చిన్నప్పటి నుంచి తిరుపతికి వచ్చిన ప్రతీసారి కాళహస్తికి వచ్చేదాన్నని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ మంచు మనోజ్ రెండో పెళ్లి(manoj second marriage) గురించి ప్రశ్నించగా.. మంచు లక్ష్మీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. `మనోజ్ పెళ్లి గురించి క్లారిటీ కావాలంటే తననే అడగండి. అది నా పరిధిలో లేని అంశం. గుడిలో వృత్తిపరమైన విషయాలు ఏమైనా అడగండి, వ్యక్తిగత విషయాలు వద్దు` అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీంతో తమ్ముడి పెళ్లి గురించి అడిగితే అదేంటి మంచు లక్ష్మి అంత మాటనేసింది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
