రానా నాయుడు(Rana Naidu).. దుగ్గుబాటి బాబాయ్-అబ్బాయిలు విక్టరీ వెంకటేష్-రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రి, కొడుకులుగా కనిపించబోతున్నారు. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కింది. ఈ సిరీస్‌కు కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించాడు. బాబాయి, అబ్బాయిలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో సైతం ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. కానీ, ఎప్పుడో షూటింగ్ పూర్తి అయినా.. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ విడుదల కాలేదు. ఫైనల్ గా అందరి ఎదురు చూపులకు తెర దించుతూ నెట్‌ఫ్లిక్స్(Netflix) వారు రానా నాయుడు స్ట్రీమింగ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రానా నాయుడు టైటిల్ విషయంలో వెంకీ అసహనం వ్యక్తం చేశాడు. స్టార్ హీరో తానైతే రానా(Rana) పేరు టైటిల్ గా పెట్టడం ఏంటంటూ ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో `ఈ వెబ్ సిరీస్ హీరో నేను, స్టార్ నేను, ఫ్యాన్ బేస్ ఉంది నాకు. అలాంటిది నా క్యారెక్టర్ నేమ్ టైటిల్ గా పెట్టాలి కానీ.. రానా రోల్ నేమ్ టైటిల్ గా పెట్టడమేంటి. నాగా నాయుడు అని టైటిల్ మార్చేయండి. లేకుంటే ఊరుకునేదే లేదు` అంటూ వెంకటేష్(Venkatesh) హిందీలో వార్నింగ్ ఇచ్చాడు. అయితే వెంకీ నిజంగా టైటిల్ విషయంలో ఈ రాద్ధాంతం అంతా చేశాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, ఇదంతా ప్రమోషన్స్ లో భాగమే. సిరీస్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వెంకీ వీడియో మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.a
