పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓ జి పేరిట ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టార్ మూవీ కి సంబంధించి తాజా అప్డేట్స్ కూడా బయటకు వస్తూ మరింత వైరల్ గా మారుతున్నాయి. ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలు అంటూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షోలకి కూడా హాజరవుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అలాగే ప్రొఫెషనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు రాజకీయాలలో ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు సుజిత దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమాకు ఊహించని రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం రీ ఎంట్రీ లో కూడా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ పొందుతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 30వ తేదీ నుంచి ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా ఘనంగా జరిగాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషకం మరింత వైరల్ గా మారుతుంది ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.75 కోట్ల మేర పారితోషకం తీసుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాదు మరోపక్క ఈ సినిమాకు వచ్చే లాభాల్లో కూడా మూడో వంతు ఆయన తీసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడట.. ఇదంతా కూడితే పవన్ కళ్యాణ్ రేమ్యునరేషన్ రూ.175 కోట్ల వరకు అవుతుంది అని తెలుస్తుంది.
మరి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా మార్కెట్ చేస్తే అంతా సేఫ్ లేదంటే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సరే రూ.200 కోట్ల పైగా మార్కెట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రం యూనిట్ . మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.