UPDATES  

 ఎమోషనల్ అవుతూ.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్..!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.. సినిమాలలో ప్రయత్నం చేసిన కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) కి మెగా అభిమానులు సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నుంచి విడిపోయారు అంటూ వార్తలు వచ్చాయో అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ సినీ కెరియర్ కూడా పతనం అయ్యింది అని చెప్పడంలో సందేహం లేదు.. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా కళ్యాణ్ దేవ్ తో శ్రీజ డివోర్స్ తీసుకుంది అంటూ ఆన్లైన్ వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా.. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు దీంతో విడాకులు నిజమే అని జనం కూడా నమ్మారు.. కళ్యాణ్ దేవ్ తో శ్రీజ డివోర్స్ తీసుకుందని.. అంతేకాదు మూడో పెళ్లికి కూడా సిద్ధం అయ్యింది అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపించాయి ..దీనికి తోడు సోషల్ మీడియాలో శ్రీజ, కళ్యాణ్ పెడుతున్న పోస్ట్లు కూడా విడాకుల ఇష్యూ ని మరింత బలం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా మొదటగా శ్రీజా తన సోషల్ మీడియా ఖాతా నుండి కళ్యాణ్ దేవ్ పేరును తొలగించడంతో వీరి విడాకుల రూమర్స్ మరింత స్ప్రెడ్ అయ్యాయి. అలాగే కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కూడా కనిపించకపోవడం ఈ రూమర్స్ కి బలాన్ని ఇచ్చింది. శ్రీజ తో విభేదాలు అనే మేటర్ బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ రెండు సినిమాలు విడుదలయ్యాయి. అదే కిన్నెరసాని ,సూపర్ మచ్చి అయితే ఈ రెండు చిత్రాలను మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తెరలేపింది.. ఇదిలా ఉండగా ఇన్ని పరిస్థితుల నడుమ కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది. ఫిబ్రవరి 11వ తేదీన తన కూతురు నవిష్క పుట్టినరోజు కావడంతో ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు కళ్యాణ్. నవ్విష్కతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మిస్సింగ్ యు అని కామెంట్ చేశారు. దీంతో కళ్యాణ్దేవ్, శ్రీజా విడాకుల మేటర్ మళ్ళీ తెరపైకి వచ్చింది ఇద్దరు విడిపోయారు కాబట్టే కళ్యాణ్ ఇలా కూతురు జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారని అర్థమవుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !