మన్యం న్యూస్ ఇల్లందు, ఫిబ్రవరి 13… ఇల్లందు మున్సిపాలిటీలోనీ 1వ వార్డు సత్యనారాయణ పురంలో సోమవారం యుపియస్ నందు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి చూపు సమస్య ఉన్నవారికి కళ్లజోళ్లు అందజేశారు. కంటీవెలుగు సేవలను 1వ వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో 1వార్డు కౌన్సిలర్ వార రవి,ఆజం,వార్డు ఆఫీసర్ కడారి వెంకటేష్, ఆశా వర్కర్లు,ఆర్పిలు,వార్డు పెద్దలు వీరభద్రం,రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.