మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 17.. అశ్వరావుపేట తహసిల్దార్ కార్యాలయంలో 2,603,016 రూపాయల విలువ చేసే 26 కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు స్థానిక ప్రజా ప్రతినిదులతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మెచ్చా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, నేటికీ 13కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం రూపంలో ప్రజలకు అందిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అనంతరం తహసిల్దార్ విల్సన్, చల్లా ప్రసాదులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మండల నాయకులు, లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.