మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 22.. ఏజెన్సీలో పలు ఆదివాసీల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆదివాసి సేన అశ్వరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కి బుధవారం వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆదివాసి సేన జిల్లా కమిటీ సభ్యులు బేతి రమేష్ మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి పలు గ్రామాల సమస్యలు, పోడు భూముల సమస్యలు పరిష్కారం కొరకు విన్నవించగా జిల్లా కలెక్టర్ తహసిల్దార్ కి ఫోన్ చేసి చెప్పగా పలు సమస్యలపై బుధవారం రోజున ఆయనను కలిసి వివరించటం జరిగిందనీ, అన్నారు సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగిందని, వాగొడ్డుగూడెం, ఆసుపాక గ్రామాలలో ఫారెస్ట్ భూములలో పొజిషన్లో ఉన్న కూడా నాట్ ఇన్ పొజిషన్ అని చూపిస్తూ సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ చట్ట విరుద్ధంగా అధికారులు పనిచేశారని వారు చెప్పటం జరిగింది. అదేవిధంగా ఆదివాసీల మీద ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు నశించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసి లను రకరకాల పేరుతో మోసం చేస్తున్నారని వారి పట్ల కూడా అప్రమత్తతో ఉండాలని, ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో అధికారులు చిత్తశుద్ధి నిరూపించాలని, వారు అన్నారు. ఇప్పటికైనా దరఖాస్తులో సూచించినటువంటి సమస్యల పైన చిత్తశుద్ధితో పని చేయాలని లేనిపక్షంలో చట్టబద్ధమైన ఉద్యమానికి సిద్ధం అవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన జిల్లా కమిటీ సభ్యులు బేతి రమేష్, మండల కన్వీనర్ కనితి వెంకటేష్, విద్యార్థి సేన మండల కన్వీనర్ కురసం బాబురావు, నాయకులు పూనమ్ రమేష్ దాట్ల చుక్కమ్మా, కుర్సం కుమారి, కారం సీత, పూనెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.