మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 22. నూతన దాంపత్య జీవితం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సుఖశాంతులతో సాఫీగా సాగిపోవాలని నూతన వధూవరులను ఎమ్మెల్యే రాములు నాయక్ ఆశీర్వదించారు . బుధవారం మండల కేంద్రంలోని ఎల్లంకి గార్డెన్స్, ఆర్కె ఫంక్షన్ హాలులో జరిగిన వివాహ వేడుకల్లో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, ఎంపీటీసీ స్వాతి, పొన్నెకంటి సతీష్ కుమార్, నున్న రంగారావు, చౌడం నరసింహారావు, ఎస్.కె మైబు, పనితి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
