UPDATES  

 కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం, ఫిబ్రవరి 22
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కో ఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబి సలీం, సర్పంచ్ ఈసం రామ్మూర్తి,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు లు ప్రారంభించారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక సబ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మొదటగా స్థానిక సర్పంచ్ కంటి పరీక్షలు చేయించుకొని అద్దాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరూ కూడా వినియోగించుకొని కంటి పరీక్షలు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమలత,డాక్టర్ దిలీప్ కుమార్,డిఈఓ రాజ్ కుమార్, స్థానిక వార్డు మెంబర్లు రామగొని అశ్విని ప్రమోద్, ఎర్రల్ల స్వరూప సారయ్య, రంజిత్ కుమార్,చిప్ప నాగరాజు,స్థానిక కోఆప్షన్ నెంబర్ ఎండి ఖలీల్, ఏఎన్ఎంలు పద్మ,సుజాత,ఆశ వర్కర్లు మాధవి,శారద, స్వరూప,గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్,రవీందర్, రాంబాబు,అనిల్,మినాజ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !