మన్యం న్యూస్ గుండాల ఫిబ్రవరి 22: పదవ తరగతిలో విద్యార్థులు పురోగతిని సాధించి మంచి మార్కులతో ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఏటీడీవో రూప దేవి తెలిపారు బుధవారం మామ కన్ను మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఆమె పర్యటించారు. ముందుగా మామ కన్ను ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థుల సమర్ధాన్ని ఆమె పరీక్షించారు. బోర్డు మీద ఉన్న తెలుగు అక్షరాలను ఒక విద్యార్థినీ చదవమంటే తెలుగు కూడా చదవటానికి ఆ విద్యార్థి తడబడటంతో కొంత అసహనం వ్యక్తం చేశారు ఇలా అయితే రానున్న పదో తరగతి పరీక్షలు ఎలా రాస్తారు.. ఎలా పాస్ అవుతారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాల పనితీరుపై కూడా ఆమె ఉపాధ్యాయులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలవకుండా రాత్రి సమయంలో ఇంటికి వెళ్లడం ఏమిటంటే ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారి నుండి మౌనమే సమాధానంగా మారిపోయింది. గతంలో సైతం మామ కన్ను ఆశ్రమ పాఠశాల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలవకుండా విద్యార్థులు రాత్రి వేళల్లో వర్షంలో సైతం ఇంటిదారి పడుతుండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తూ వారు ఎటు వెళ్తున్నారు దృష్టి సారించాలని సిబ్బందికి ఆమె సూచించారు.
పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ ఏమిటి పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ ఏమిటని మన్యం న్యూస్ ఏటీడీఓ రూపా దేవి నీ అడగగా కొంతమేర పరవాలేదని పరీక్షల నాటికి విద్యార్థులంతా గాడిన పడతారని ఆమె పేర్కొన్నారు.
