మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి 22 :
పోకలగూడెం, వెంకటియాతండా పంచాయతీల అభివృద్ధి బాధ్యత నాదేనని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఎమ్మేల్యే స్వగృహంలో రెండు పంచాయతీల బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మేల్యేను కోరారు. దానికి స్పందించిన ఎమ్మేల్యే మాట్లాడుతూ…. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని, గిరిజన గ్రామాల అభివృద్ధి తనదేనన్నారు. ఎమ్మేల్యేను కలిసిన వారిలో పోకలగూడెం, వెంకటియాతండ పంచాయతీల సర్పంచ్ లు ఇస్లావత్ నిరోషా, గుగులోత్ బాలాజీ, మాట్లాడారు.నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అని, మెచ్చా వెంట మా ప్రయాణం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగులోత్ రాములు, బిఆర్ఎస్ నాయకులు బాబులాల్, ఇస్లావత్ భద్రు, ఇస్లావత్ వీరన్న, ఇస్లావత్ రాము, బానోత్ సోమ్లా, వార్డు మెంబర్ భూక్య రమేష్, ధరావత్ శంకర్, తారా చంద్, తదితరులు పాల్గొన్నారు.