మన్యం న్యూస్ గుండాల ఫిబ్రవరి 22 మూగజీవాలలో సంభవిస్తున్న మరణాలను నట్టల నివారణతో తగ్గించవచ్చని వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని ముత్తాపురం గ్రామంలో ఎంపీపీ ముక్తి సత్యం చేతుల మీదుగా రైతులకు నట్టల మందులను అందించారు. నట్టల వలన మూగజీవాలలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రెండు బృందాలుగా ఏర్పడి మండలంలోనీ గ్రామాల్లోని మూగజీవాలున్న రైతులందరికీ మందులను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గొర్రెలు, మేకలు ఉన్న ప్రతి రైతు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ రాము, నరేష్ , మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు
