మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి22: విద్యార్థులు పట్టుదలతో చదివితేనే అనుకున్న విజయాన్ని సాధించగలమని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రేగా కాంతారావు అన్నారు. ఆయన బుధవారం
మండలంలోని ముత్యాలమ్మ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకే లైబ్రరీ ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తమకు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. పుస్తకాలు చదవడం వల్ల మెదడుకు పదును పెరుగుతుందన్నారు. దీనివల్ల ఎలాంటి పోటీ పరీక్షలనైనా అధికమించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, బిఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, సర్పంచ్ జంపేశ్వరి, ఉప సర్పంచ్ తరుణ్ రెడ్డి, కుర్రి నాగేశ్వరరావు, జావిద్ పాష, కత్తి రాము, మేకల రవి, నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
