- ఏళ్లనాటి కల నెరవేర్చనున్న రేగా
- బీటిపిఎస్ నుండి పెంటన్నగూడెం వరకు బిటి రోడ్డు నిర్మాణం
- శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా
- రేగా కాంతారావుకు రుణపడి ఉంటాం : పెంటన్నగూడెం ప్రజలు
మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 22…
మండల పరిధిలోని సీతారామపురం పంచాయతీలో గల పెంటన్నగూడెం వాసులకు ఏళ్లనాటికల నెరవేరనుంది. పెంటన్నగూడెం గ్రామం నుంచి ప్రధాన రహదారి వరకు రావాలంటే ఒకవైపు ఉప్పాక గ్రామం, మరొకవైపు బొమ్మరాజుపల్లి గ్రామం మీదుగా చేరుకోవాలి. ప్రస్తుతం పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో బీటిపిఎస్ నుంచి పెంటన్నగూడెం వెళ్లే మార్గం సుగమం కానుంది. ఒక కోటి 98 లక్షల రూపాయల వ్యయంతో బీటిపిఎస్ ప్రాంతం నుంచి పెంటన్నగూడెంకు రహదారి నిర్మాణం కొరకు ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బీటీ రోడ్డు నిర్మాణాలను చేపట్టిందని, అందులో భాగంగానే మండలంలోని మారుమూల గ్రామం పెంటన్నగూడెంకు రహదారి నిర్మాణం పూర్తికానుందని తెలియజేశారు. శంకుస్థాపన పట్ల పెంటన్నగూడెం వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే రేగా కాంతారావుకు రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, సీతారామపురం సర్పంచ్ నాలి మహేష్ , అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య , మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, ముక్కు నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.