మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 22..
రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి వారం రోజుల వరకు మండలంలో ఉన్న మేకలకు, గొర్రెలు అన్నింటికి ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేయబడుతుందని గొర్రెలు, మేకలున్న యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పినపాక మండల పశువైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ చౌహాన్ బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా బందగిరినగరం, బోటి గూడెం, మడతన కుంట గ్రామాలలో 218 గొర్రెలకు,691 మేకలకు నట్టల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది శేఖర్, ప్రతాప్, రైతులు పాల్గొన్నారు.