UPDATES  

 కంటి వెలుగును ప్రారంభించిన బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ

కంటి వెలుగును ప్రారంభించిన బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ

మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 24
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి మురళి ఆధ్వర్యంలో శుక్రవారం బిఆర్ ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కాని శ్రీనివాస్, ముఖ్య అతిథులుగా హాజరై గ్రామపంచాయతీ కార్యాలయంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కంటి వెలుగు  తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఈ పథకం రూపొందించింది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.
తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని మండలం లోని అన్ని గ్రామాల ప్రజలు అందరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టీ మల్ల సమ్మయ్య, కటికనేని సత్యనారాయణ,కోడం సత్యనారాయణ,పబ్బోజు సత్యనారాయణ చారి,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, మండల షోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,మండల మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు పంపాన పార్వతి, దేవనపల్లి అనురాధ,యూత్ కమిటీ ఉపాధ్యక్షులు యాస నాగేందర్, ఎస్సి సెల్ కమిటీ ఉపాధ్యక్షులు గంగెర్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి జాడి రవి, ఎస్టీ సెల్ అధ్యక్షులు పోరిక సమ్మయ్య, బీసీ సెల్ నాయకులు సత్యం తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !