మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 24 పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించాలని ఏసీఎంఓ టి. రమణయ్య స్పెషల్ ఆఫీసర్ ఎస్. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని చిరుమళ్ల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు 10 జిపి సాధించే విధంగా కృషి చేయాలని పాఠశాలల యందు 100% ఫలితాలు తీసుకురావాలని వారు అన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులకు భయం పోగొట్టి నాణ్యమైన విద్య అందించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్ ఇతర పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
