మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి24: కంటివెలుగు కేంద్రాన్ని పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుర్రంగూడెం పంచాయతీ సర్పంచ్ కాక సీత పిలుపునిచ్చారు. శుక్రవారం గుర్రంగూడెం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దీర్ఘకాలికంగా ఉన్న కంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని, ఎటువంటి కంటి సమస్యలున్న కంటివెలుగు కేంద్రానికి వచ్చిచికిత్సను తీసుకోవచ్చన్నారు. అవసరం ఉన్నవారికి కండ్లజోళ్లు ఇవ్వడంతో పాటు, కంటికి చికిత్స అవసరం ఉన్నవారి పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుందని, వెంటనే వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు చికిత్సను అందించటం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫిషర్ కనకం తనూజ, కంటి వైద్యులు రఘునాధ్ సాయి, వైద్య సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్మినేని చిన్న లక్ష్మణరావు గ్రామ పెద్దలు అనుమోలు హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు..
