మన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 24
మండలంలో కస్తూరిబా గాంధీ పాఠశాలకు జి సి డి ఓ, జి రమాదేవి, శుక్రవారం సాధారణ తనకి చేశారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.విద్యార్థులతో అర్ధ గంట పాటు విద్య సంబంధిత అంశాలపై సంభాషించారు. గణిత శాస్త్రంలో కొన్ని ప్రశ్నలు అడగగా విద్యార్థులు స్పందన చూసి కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదివిన విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులను కొని ఆడారు. కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు, విద్యాలోనే కాకుండా కరాటే ను నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో వాజేడు కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం ఆనందదాయకంగా ఉందన్నారు. కస్తూరిబా గాంధీ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ ఓ సుజాత, తెలిపారు.
