Mమన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 24.
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ ఏటూర్ నాగారం ఆదేశానుసారం గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు మార్చి 3 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం (ఎంపీడీవో )వాజేడు, ములుగు జిల్లా నందు ఇంటర్వ్యూ ఎంపిక కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇంటర్వ్యూ కు విద్యా అర్హత పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ,పీజీ, ఐటిఐ, డిప్లమా, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ ,ఎంబీఏ, బీటెక్, చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వారు అర్హులు, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో జరిగే జాబు మేళకు నిరుద్యోగులు యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోగలరని పిఓ అంకిత్ తెలిపారు.
పూర్తి సమాచారం కొరకు
949 0341911,8008932159 నెంబర్లలో సంప్రదించాలన్నారు.