మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24…మానవ సేవే మాధవ సేవ అని వైకల్యంతో భాదపడుతున్న దివ్యాంగులకు ఈసిఐఎల్ కంపెనీ ఉపకరణాలు అందచేయడం చాలా సంతోషమని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం క్రీడా మైదనాంలో ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులతో దివ్యాంగులకు
సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన
అనంతరం వారు మాట్లాడారు. మనిషికి వైకల్యం అడ్డుకాదని విధి ఆడిన వింత నాటకంలో కొందరు
అవయవ లోపాలకు గురయ్యారని చెప్పారు. అయినప్పటికీ వైకల్యాన్ని అధిగమించి నేడు సకలాంగులతో సమానంగా
అన్ని రంగాలలో ముందుకు పోతున్నారని ఈ సందర్భంగా వారందరినీ ఆయన అభినందించారు. దివ్యాంగులను ప్రోత్సహానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని, వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన
స్పష్టం చేశారు.దివ్యాంగులు స్వశక్తితో పైకి ఎదగాలని
సహాయ పరికరాలనుమంచిగావినియోగించుకోవాలని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో సహాయ పరికరాలు కావాలని దివ్యాంగులు ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చేవారని కలెక్టర్ తెలిపారు అట్టి విజ్ఞాపనల ప్రకారం దివ్యాంగుల
ఎంపిక కొరకు ఆరు నెలల క్రింతం కసరత్తు ప్రారంభించి క్యాంపులు నిర్వహించి అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు.405 మంది దివ్యాంగులకు వివిధ పరికరాలు అందచేస్తున్నామని చెప్పారు. ఈసిఐఎల్ కంపెనీ దివ్యాంగులకు అవసరమైన
పరికరాలు ఇచ్చేందుకు ముందుకు రావడం చాలా సంతోషమని చెప్పారు. రూ.40 లక్షల సిఎస్ఆర్ నిధులతో 741పరికరాలను నేడు అందచేస్తున్నామని చెప్పారు. శారీరక వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ పరికరాలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ఈసిఐఎల్ కంపెనీ ఇచ్చిన ఈ పరికరాలు 405 మంది జీవితాలకుఉపయోగపడుతున్నాయని చాలా సంతోషమని చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మరికొంతమంది దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలు అందచేస్తామని చెప్పారు. కంపెనీలు లాభాల్లో కొంత
మొత్తాన్ని సమాజికంగా సమాజానికి ఉపయోగపడాలన్నదే సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈసిఐఎల్
కంపెనీ ప్రజలకు ఉపయోగ పడే ఎన్నో పరికరాలు తయారు చేశారని చెప్పారు. ఈసిఐఎల్ ఓటు హక్కు వినియోగించేకంపెనీ ఓటింగ్ యంత్రాలను తయారు చేసిన ఘనత ఉన్నదని చెప్పారు. పరికరాలకు సంవత్సరం పాటు గ్యారంటీ
కూడా ఇచ్చారని, ఏదేని సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరందివ్యాంగులకు పరికరాలు అందచేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా, ఈసిఐఎస్ అడిషనల్ జనరల్
మేనేజర్ మునిక్రిష్ణ, అలీం కో సీనియర్ మేనేజర్ రాజేష్, ఈసిఐఎల్ సీనియర్ వైధ్యాధికారి డాక్టర్ విశ్వనాధరెడ్డి, పర్సనల్
అధికారి సునీలక్కుమార్, సీనియర్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, యూనిట్ మేనేజర్ బాలక్రిష్ణ, స్థానిక కౌన్సిలర్ లక్ష్మణ్ దివాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు గుండపునేని సతీష్ తదితరులు పాల్గొన్నారు.
