మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24.. ఇటీవల హర్యానా రాష్ట్రంలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్ పరుగు పందెంలో రెండు స్వర్ణ పథకాలు, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించి కొత్తగూడెం పట్టణ ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిన సి.హెచ్. కె.నాగయ్యను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నాగయ్యను శాలువా, పూల మాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ. జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీలకు నాగయ్య ఎంపిక కావడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒకే ఒక్కడు జాతీయ సతైలో రాణించడంతోపాటు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. యువ క్రీడాకారులు నాగయ్యను ఆదర్శనంగా తీసుకొని క్రీడ రంగంలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, నాయకులు భాగం మహేశ్వర్ రావు, భాగం మాధవరావు, జగన్, యాలాద్రి, ప్రసాద్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
