మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 24
మండల పరిధిలోని జానంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన హిటాచి ఏటీఎం సెంటర్ ను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జానంపేట గ్రామంలో ఏటీఎం సెంటర్ ప్రారంభం కావడం సంతోషమని, ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏటీఎం నిర్వహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, హిటాచి ఏటీఎం నిర్వాహకులు, ఎడ్ల కుమార్, పొనుగోటి కామేశ్వరరావు, బోడ ఈశ్వర్, బుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
