మన్యం న్యూస్ అశ్వాపురం, ఫిబ్రవరి 24, అశ్వాపురం మండలం లోని రామచంద్రాపురం గ్రామ పంచాయతీలో ఆశ్వాపురం వైద్యాధికారి డాక్టర్ జి.అరుణ అధ్వర్యంలో శుక్రవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో స్థానిక సర్పంచ్ కాక అశోక్ ఆయుర్వేద సృష్టి కర్త అయినటువంటి భగవాన్ ధన్వంతరి కి జ్యోతి ప్రజ్వలన చేసి వైద్యశిబిరం ను ప్రారంభించారు.ఈ వైద్య శిబిరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల,ఆశ్వాపురం వైద్యాధికారి డాక్టర్ జి.అరుణ సుమారు 200 మంది రోగులను పరీక్షించి ఆయుర్వేద మందులు అంద చేయడం జరిగింది.ఈ శిబిరం కు వచ్చిన రోగులకు ఆయుష్ ఆరోగ్య కరదీపికలను అందించి ఆయుర్వేద జీవన శైలి, ఔషధాల విశిష్టతను వారికి వివరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో,రామచంద్రాపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ తౌఫీక్ ,ఏఎన్ఎం భవాని, నాగమణి.ఎంఎన్ఓ.శ్రీనివాస్, ఎస్ఎన్ ఓ.రాధిక,ఆశా కార్యకర్తలు,గ్రామపెద్దలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.