మన్యం న్యూస్,పినపాక, ఫిబ్రవరి 24
మండల పరిధిలోని జానంపేట గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కన్నెగంటి దుర్గాప్రసాద్ అనారోగ్యంగా ఉన్నారని తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, కోలేటి భవాని శంకర్, బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
