మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 24
ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐ గా నాగుల్ మీరా ఖాన్ బాధ్యతలు తీసుకున్న తరుణంలో పినపాక మండల గ్రామీణ వైద్యుల బృందం శుక్రవారం ఆయనను కలిసి పుష్పగుచ్చాన్ని అందించి, శాలువాతో సన్మానించారు. అనంతరం ఎస్సై నాగుల్ మీరా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ వైద్యుల సేవలను మరువలేనివన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు ప్రజలకు ఎంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. పరిమితిని మించి వైద్యం కూడా చేయవద్దని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు శ్రీరామ్, నరసింహారావు, శివ శంకర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
