మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి24: పంచాయతీ అభివృద్ధికి అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రోత్సాహం మరువులేనిదని రావికంపాడు పంచాయతీ సర్పంచ్ బానోత్ రన్య అన్నారు. శుక్రవారం రావికంపాడు గ్రామంలో నూతనంగా రూ. 15లక్షల నిధులతో మంజూరైనా సీసీరోడ్ల నిర్మణానికి సర్పంచ్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఏ ఎమ్మేల్యే సైతం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని, బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో అభివృద్ధి సాధ్యమనడానికి నిధుల విడుదల ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామశాఖ అద్యక్షులు భూపతి రమేష్, వార్డుమెంబర్ భూక్య భద్రు, బాదావత్ వెంకటేశ్, యూత్ నాయకులు మెట్ల నరసింహరావు, కెక్కర్లు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
