గ్రామ దేవతల ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే రాములు నాయక్..
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ..
మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 24, మండల పరిధిలోని కరివారిగూడెం గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామదేవతల ప్రతిష్ట మహోత్సవంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే రాములు నాయక్ కీ పూర్ణకుంభంతో స్వాగత ఆహ్వానం పలికారు. అనంతరం గ్రామ దేవతలైన శ్రీ ఆంజనేయ స్వామి, నాభిశిల, (బొడ్రాయి) ముత్యాలమ్మ తల్లి విగ్రహ యంత్ర స్థాపన ప్రతిష్ట ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనహితం కోసం గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, చిరునవ్వుతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.