మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 24 ..ప్రేమ విఫలం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామానికి చెందిన మొల్కం దివాకర్ (20) గత కొంతకాలంగా యువతీతో ప్రేమలో పడ్డాడు. పెద్దలు నిరాకరించడంతో గురువారం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు గమనించిన స్థానికులు గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు చికిత్స పొందుతూ దివాకర్ మృతి చెందాడు. మృతుని సమాచారం తెలుసుకున్న గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దివాకర్ భౌతిక కాయాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు .
