మన్యంన్యూస్, మంగపేట. ఫిబ్రవరి 23
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కాలనీ లో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం లోక కళ్యాణనార్థం బిల్ట్ పేపర్ ఫ్యాక్టరీ తెరవాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ 246 వ, శ్రీరామ యజ్ఞం నిర్వహించారు.విశ్వశాంతికోసం, లోక కళ్యాణనార్థం 1008 గ్రామాల్లోని ఆంజనేయ దేవాలయాల్లో శ్రీరామయజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర హనుమాన్ ప్రచారకులు శ్రీరాములు స్వామి గాదేపాక తెలిపారు. అందులో భాగంగా 246 హోమం కమలాపురం లో నిర్వహించామని వారు తెలిపారు. జీవనదారమైన బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడటంతో గ్రామప్రజలు జీవనాధారం కోల్పోవడం వలన దానిని పునప్రారంభం చేయాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ 246 వ శ్రీరామ యజ్ఞం 12 గంటల మౌన దీక్ష చేపట్టామని తెలిపారు. ఈ మౌనదీక్ష భద్రాచలంలో విరమించడం జరుగుతుంది అని వారు అన్నారు. ప్రజలు పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీరాములు స్వామి,వింజమురి రవి,తాటిపల్లి రాజేందర్,గూడ యాదగిరి, శ్రీరామ్ అశోక్,కొల్లూరి రాజు,కొల్లి పూర్ణచందర్ రావు,ఇల్లందుల చందు తదితరులు పాల్గొన్నా
