మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 23
లేగ దూడ అనారోగ్యంగా ఉండి చావు బతుకుల్లో కొట్టుమిట్టు లాడుతుందంటే వైద్యం అందించాల్సిన పశు వైద్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం చేయడంతో తన పశువు మరణించిందని సీతానగరం గ్రామానికి చెందిన పశువుల యజమాని ఉమ్మినేని రవి గురువారం ఆరోపించాడు. తనకు చెందిన గేదె లేగ దూడ గురువారం ఉదయం పశువుల పాకలో నోటినుండి నురగ కక్కుతూ స్పృహ కోల్పోయి ఉందని ఇది గమనించిన యజమాని స్థానికంగా ఉన్న పర్ణశాల పశు వైద్యశాఖ సిబ్బందికి ముందుగా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా తాము వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉన్నామని అందుబాటులో లేమని తెలపడంతో సంచార పశు వైద్య వాహనం కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వాహన సిబ్బంది కూడా తాము అందుబాటులో లేమని రావడానికి సమయం పడుతుందని సదరు యజమానికి తెలిపి ఈలోగా ప్రాథమిక చికిత్స అందించమని చెప్పారు. పశువులు ఎటువంటి మార్పు రాకపోగా ఆరోగ్యం మరింత క్షీణించి గేదె లేగా దూడ మరణించినట్లు తెలిపారు. పశు వైద్య శాఖ అధికారులు సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే తన దూడ బతికి ఉండేదని యజమాని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏజెన్సీ గ్రామాలలో సకాలంలో వైద్యం అందించి పశువులను కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఇట్టి విషయమే పై అధికారులు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.