రూ.100 కోట్లతో 487 అభివృద్ధి పనులు: ప్రభుత్వ విప్ రేగా
రేవంత్ రెడ్డి పై పరువు నష్టం దావా వేస్తాను
రూ.100 కోట్ల వైట్ మనీ ఆఫర్ ఇచ్చిన లెక్క చేయలేదు.
పాయం డిలీట్ అయిన బ్యాచ్.
విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు
మన్యం న్యూస్,మణుగూరు టౌన్ ,ఫిబ్రవరి22:
పినపాక నియోజకవర్గం లోనీ ఏడు మండలాల్లో రూ.100 కోట్ల నిధులతో 487 అభివృద్ధి పనులకు నిధులు మంజూరయని,సుమారు 300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావశంలో విప్ రేగా మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గాన్ని ధనిక నియోజకవర్గంగా తీర్చి దిద్దుతున్నామని,రు.35 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మిస్తామన్నారు. పాలీసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ మణుగూరులో తొలిసారిగా నిర్వహించబోతున్నామని విప్ రేగా కాంతారావు తెలిపారు. కొత్తగూడెం తర్వాత అత్యంత వేగంగా మణుగూరు అభివృద్ధి చెందుతున్నది అన్నారు. మార్చిలో నియోజకవర్గం లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహిస్తారనీ వారు పేర్కొన్నారు.అంబేద్కర్ సెంటర్ నుండి బొంబే కాలనీ గాంధీ సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామనీ తెలిపారు. రాజకీయాలలో ప్రజా అవసరాల గుర్తించని వారు రాణించలేరు అన్నారు.కుర్చీ కోసం నాన్న తంటాలు పడుతూ లక్ష్యం లేని వారు పినపాక నియోజకవర్గం లో రాజకీయం చేస్తున్నారు అన్నారు.పాయం వెంకటేశ్వర్లు డిలీట్ అయిన బ్యాచ్ నాయకుడు అని,రేవంత్ రెడ్డి విఫలమైన నాయకుడు గా చలామణి అవుతున్నారు అన్నారు.నోటుకు ఓటు లో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.పినపాక నియోజకవర్గం లో సంస్కారం లేనివాడిగా విమర్శలు చేశారన్నారు.టికెట్లు అమ్ముకునే సాంస్కృతి కాంగ్రెస్ పార్టీది అన్నారు.ఆదివాసి నాయకుడిని జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి గంటలో పీకేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి అతని బృందంపై లీగల్ గా అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామన్నారు. 2009కి ముందు నియోజకవర్గంలో కాంగ్రెస్ లేదన్నారు.కాంగ్రెస్ ను బలోపేతం చేసింది నేనే అన్నారు.భవిష్యత్తును ఆలోచించుకునే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ కి వెళ్ళాను అని అన్నారు.నేను పార్టీ మారలేదని రాజ్యాంగబద్ధంగా విలీనం ఆయన అని తెలిపారు.100 కోట్లు వైట్ మనీ వంద మంది సెక్యూరిటీ ఆఫర్ చేసిన లెక్క చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నామీద మోపిన ఆరోపణలన్నిటికీ చర్చలకు సిద్ధమని తెలిపారు.నాపై విడుదల చేసిన చార్జ్ సీటుపై నిజాలు తేలితే రాజకీయాల నుండి విరమించుకుంటానని అన్నారు.ఈ సమావేశంలో జెడ్పీటీసీ పోశం. నరసింహారావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపిటిసి ల జిల్లా కార్యదర్శి గుడిపుడి కోటేశ్వరరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు, పార్టీ సీనియర్ నాయకులు,యాదగిరి గౌడ్, కత్తి రాము,సంజీవరెడ్డి,పాకాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.