UPDATES  

 ఇంటి వద్దకే తపాల సేవలు.. భద్రాచలం నార్త్ ఏ ఎస్పి వి.సుచందర్…          

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 23
తపాలా పొదుపు ఖాతా మహోత్సవంలో భాగంగా తపాలా శాఖ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి తపాల సేవలు అందిస్తారని  భద్రాచలం నార్త్ సబ్ డివిజన్ పోస్టల్ ఇంచార్జ్ ఏ ఎస్ పి వి సుచెందర్ అన్నారు, తపాలా పొదుపు ఖాతా మహోత్సవంలో భాగంగా  దుమ్ముగూడెం సబ్ పోస్ట్ ఆఫీస్ లో గురువారం సమావేశం నిర్వహించారు, దుమ్ముగూడెం గ్రామంలో ర్యాలీ నిర్వహించిన పోస్టల్ అధికారులు సిబ్బంది ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు పొదుపు ఖాతాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరు స్థానిక పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతా ఉండాలని, ఇంటి వద్దనే పోస్టల్ సేవలు అందిస్తామని తెలిపారు, ఈ నెల 20 నుంచి 24 వ తేదీ వరకు  దేశవ్యాప్తంగా తపాలా శాఖ పొదుపు ఖాతా మహోత్సవాలు  జరుపుతున్నట్లు తెలిపారు, వినియోగదారులకు న్యాయమైన సేవలు అందిస్తూ, వివిధ రకాల స్కీములు పోస్టర్ శాఖ అందిస్తున్నట్లు ప్రజలకు వివరించారు, ప్రతి ఒక్కరూ పోస్టల్ శాఖ యొక్క సేవలు వినియోగించుకోవాలని, పోస్టల్ శాఖలో ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకు వచ్చిందని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో రికరింగ్ డిపాజిట్ టైం డిపాజిట్ పి పి ఎఫ్ ఖాతాలో చేసుకొనే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఎస్ పి ఎం జానకి రాముడు, మెయిల్ వర్సెస్ ఆనంద గోపాల్, దుర్గాప్రసాద్, పోస్ట్ మన్ కిరణ్ , బి పి ఎం లు కోటిరెడ్డి, సాగర్, వీర రాఘవరెడ్డి, ఆదిలక్ష్మి, నీరజ, పాషా, వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !