మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 23 వలస ఆదివాసి గుడాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని కొరారు గురువారం.ఈ సదర్బంగా అయన వలస ఆదివాసి గూడేల్లో మౌలిక సౌకర్యాల సమస్య తీవ్రంగా నెలకొంటుందని మౌలిక సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టి సారించాలని,రోడ్లు లేక వర్షాకాలం అనేక ఇబ్బందుల పడుతున్నారని గ్రామాల్లో కరెంటు లేక చిమ్మ చీకట్లో గుడాలు మగ్గిపోతున్నాయని అన్నారు.చతిస్గడ్ నుంచి బ్రతుకుతెరువు కొరకు వలస వచ్చినంత మాత్రాన ఈ దేశ పౌరులు కాకపోతారా అని వీరికి రాజ్యాంగ ఫలాలు అతీతం కావా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతికే ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ ఆ హక్కును హరించేలా పాలకవర్గాల విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటున్నాయని వారన్నారు తక్షణమే ఆదివాసి గూడాలకు రోడ్లు, కరెంటు లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోడియం అడమయ్య ,పోడియం లక్ష్మయ్య, మడివి భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
