మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 23 కరకగూడెం మండల పరిధిలోని కొత్తగూడెం, పోలకమ్మతోగు గ్రామాలలో నాగులమ్మ జాతర గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసి సంప్రదాయాలతో వనం నుంచి వన దేవతలను గుడికి తీసుకొచ్చి పూజల నిర్వహించారు. సాయంత్రం నాగులమ్మ పూజారులు నిప్పుల గుండంలో నడిసి ముళ్ళ ఉయ్యాలలో ఊగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆ ఉత్సవాన్ని చూడడానికి భక్తులు చుట్టుముక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చి తమ భక్తిని సాటుకున్నారు. శుక్రవారం రోజు భక్తులు తమ ముక్కులను చెల్లించుకుంటారని ఆలయ కమిటీ వారు తెలిపారు. పోలకమ్మతోగు,కొత్తగూడెం గ్రామలలో జరుగుతున్న జాతరలో ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అయ గ్రామపంచాయతిల సర్పంచ్ లు తెలిపారు.
