మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 23 మండల పరిధిలోని తాటిగూడెం గ్రామంలో రూ.15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను గురువారం స్థానికి సర్పంచ్ కొమరం.విశ్వనాధం ప్రారంబించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత పాలకులు చెయ్యని పనులన్నీ నేటి ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చెస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం. నర్సింహరావు, కొంపెల్లి పెద్ద రామలింగం, నాయకులు యాకూబ్ ఖాన్, ఎలిపెద్ది. శ్రీనువాస్ రెడ్డి, ఉపసర్పంచ్ జాడి.రామనాథం తదితరులు పాల్గొన్నారు.
