మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 23
అంగన్వాడి టీచర్లు, మినీ టీచర్స్ గ్రాట్యుటీ చట్టం అమలు కోసం మార్చి1, 2,3, తేదీల్లో నిరవధిక సమ్మె చేస్తున్నట్టు జిల్లా కార్యదర్శి జి పద్మ తెలిపారు. గురువారం మండలంలోని ఎలమంచి సీతారామయ్య భవనంలో దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కమిటీల సంయుక్త సమావేశం పాయం రాధా కుమారి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జి పద్మ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఐ సి డి ఎస్ లను బలహీన పరుస్తుందని విమర్శించారు. బడ్జెట్ నిధుల్లో కోత పెట్టి పేద ప్రజలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడి కేంద్రాలను దూరం చేస్తుందని అన్నారు, గ్రాడ్యుటి చట్టం అమలు చేసి చట్టబద్ధంగా బెనిఫిట్స్ వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మినీ కేంద్రాలను అంగన్వాడి సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసి కనిసా వేతనం రూ.26,000 చెల్లించాలని పెండింగ్లో ఉన్న వేతనాలు త్వరగా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అనుబంధ అంగన్వాడి టీచర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎం విజయ సాలి నాయకురాలు కమలాదేవి కృష్ణవేణి స్వరూప రమణ లలిత వెంకటరమణ సమ్మక్క అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.