UPDATES  

 కలెక్టర్ ఆదేశాలతో.. మట్టి ఇసుక అక్రమ రవాణాపై కొరడా

కలెక్టర్ ఆదేశాలతో..
మట్టి ఇసుక అక్రమ రవాణాపై కొరడా
పలు వాహనాలను స్వాధీనం చేసుకున్న మైనింగ్ శాఖ అధికారులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 23..మట్టి, ఇసుక అక్రమ రవాణా చేయు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో గురువారం మైనింగ్, రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు . రెండు రోజులుగా జిల్లాలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పాల్వంచ మండల పరిధి, తోగ్గూడెం లోని సతీష్ క్వారీలో అక్రమంగా డ్రిల్లింగ్ చేస్తున్నారనే పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఒక టిప్పర్, ఒక బ్రేకర్, రెండు ప్రొక్లైన్ లను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఎడి జయ్ సింగ్ తెలిపారు.
అనుమతులు లేకుండా మట్టి, రాళ్లు, ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు, వాహనాలు సీజ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మట్టి, ఇసుక రవాణా జరిగే ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాల్వంచ. మండల పరిధిలో ఇసుక మట్టి అక్రమ రవాణపై మైనింగ్ రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి 23 లారీలు, 17 ట్రాక్టర్లు, 3 జెసిబిలు పట్టుకొన్నారని చెప్పారు. వీరి నుండి రూ.12 లక్షల 65 వేల రూపాయలు జరిమానా వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా అక్రమ దందా నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !