మన్యం న్యూస్ మణుగూరు టౌన్: పిబ్రవరి 23
మణుగూరు లోని సద్గురు సాయినాథ్ మహారాజ్ శిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట చేసి నేటికీ 29వ సంవత్సరం లోకి అడుగు పెట్టింది. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మణుగూరు సాయి నగర్ లోని సాయిబాబా ఆలయంలో గురువారం వేకువ జాము నుంచి బాబాకి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి ని చాటుకున్నారు.ఆలయ కమిటీ అధ్యక్షులు శివకామేశ్వరి గ్రూప్స్ అధినేత దోసపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో 29వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను రూపొందించింది మణుగూరు పట్టణంలోని పుర ప్రముఖుల దాతృత్వంతో వేలాదిమంది భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సాయిబాబా ఆలయ ప్రాంగణం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నినాదాలతో మార్మోగింది.ఈ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో సేవకులు క్రమశిక్షణతో భక్తిశ్రద్దలతో కార్యక్రమం విజయవంతానికి అగ్ర భాగాన నిలిచారు.ఈ కార్యక్రమంలో సేవకులు దోసపాటి నాగేశ్వరరావు,చెక్క బాలకేశ్వరరావు,సాయి సేవకుల బృందం శివ రామకృష్ణ,రఘు,చైతన్య,చారి, రామ్ సాయి,వాసుదేవ, వసంత,వెంకటరమణ, సుచరిత్ర,ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ,ఆలయ గుమస్తా బండారి వెంకన్న, శిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు,సాయి సేవా బృందం తదితరులు పాల్గొన్నారు.