పేద విద్యార్థులకు అండగా నిలిచిన వాసిరెడ్డి శివాజీ జీవితం ఆదర్శనీయం
సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
వాసిరెడ్డి శివాజీ ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన సిపిఎం నాయకులు
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25… అమరజీవి వాసిరెడ్డి శివాజీ చిన్ననాటి నుంచి సామాజిక స్పృహతో జీవనాన్ని కొనసాగిస్తూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో కిలక పాత్ర పోషిస్తూ పేద విద్యార్థులకు అండగా నిలిచి.. శ్రీ విద్య విద్యాసంస్థ స్థాపించి ప్రైవేట్ విద్యను పేదలకు సైతం అందించి అండగా నిలిచారని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు . శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో వాసిరెడ్డి శివాజీ 8వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రైవేటు విద్యను సంతలో సర్కుల్లాగా ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుతూ విద్యార్థులను, విద్యార్థులు తల్లిదండ్రులు దోపిడీ చేస్తూ డబ్బును సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని కోరిన శివాజీ ఆశయ బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, జీలకర్ర పద్మ, భూక్య రమేష్, నందిపాటి రమేష్, కొట్టి నవీన్, అన్నవరపు పద్మ, విజయ్, సతీష్, సలీం, వేణు తదితరులు పాల్గొన్నారు
