మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 25
అంగన్వాడీ కేంద్రాలలోని కార్యకర్తలు తల్లి, పిల్లలు పౌష్టిక ఆహారం తీసుకునే విధంగా సలహాలు ఇవ్వాలని, తృణధాన్యాల ఆవశ్యకత గురించి తెలియజేయాలని శనివారం పినపాక లో రైతు వేదికలో మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాలలోని అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో సిడిపిఓ జయలక్ష్మి తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు హాజరయ్యారు. తృణధాన్యాలతో కూడిన పొట్లాలను తెలంగాణ ప్రభుత్వం తల్లి బిడ్డల కొరకు అందిస్తుందని, అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా ప్రతి బుధవారం శనివారం ఈ ఆహారం వారికి అన్ని విధంగా చేయడం తీసుకోవాలని ఆదేశించారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తృణధాన్యాల అవశ్యకత ఎంతైనా ఉందని పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఇంత మంచి కార్యక్రమం ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పినపాక సెక్టార్ పరిధి అంగన్వాడీ సూపర్వైజర్ సత్యవతి, వివిధ గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
